మాజీ నక్సల్స్ కు తక్షణమే ఇంటి స్థలాలు ఇవ్వాలి
జై స్వరాజ్ పార్టీ డిమాండ్
O6 జూన్ /25 (న్యూస్ 6 డిజిటల్ డెస్క్)
ప్రభుత్వ పిలుపు మేరకు లొంగిపోయిన మాజీ నక్సల్స్ కు తక్షణమే ఇంటి స్థలాలు ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. వివిధ సందర్భాలలో ప్రభుత్వం పిలుపు మేరకు అనేక మంది నక్సల్స్ లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారని, వారికి ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదని జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద మాజీ నక్సల్స్ నిర్వహించిన ధర్నాకు జై స్వరాజ్ పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా వారి తరఫున మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వివిధ సందర్భాల్లో లొంగిపోయిన మాజీ నక్సల్స్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కృష్ణ మోహన్ అన్నారు. మాజీ నక్సల్స్ నిర్వహించిన ధర్నాలో రమేష్, గాజుల యాదగిరి, వి.బాలయ్య, కె. చంద్రమౌళి, టి. భిక్షపతి, గంధమల్ల శ్రీనివాస్, కట్టల విజయలక్ష్మి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.