రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకం
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి
ఖమ్మం, జూన్ 20 (న్యూస్ 6 డిజిటల్)
రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. శు క్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి మయూరి సెంటర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా ఎక్స్టెండెడ్ ఎక్స్ క్యూటివ్ సమావేశం సుమారు 300 మంది జిల్లా, అసెంబ్లీ, మండల, కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. మన పని మనం చేసుకు పోవాలని పార్టీ తన పని తాను చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి దీపక్ ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, ఖలీల్ పాషా, బెజ్జం గంగాధర్, భానోత్ కొటేష్, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల మహేష్, క్రాంతి, బెల్లంకొండ శరత్,రాధాకృష్ణ, ఉత్తేజ్, భూక్యా భద్రం, కార్తీక్ మరియు అన్ని అసెంబ్లీ నియోజక వర్గ అద్యక్షులు, మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.