తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!
న్యూస్6 డెస్క్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల సంఘం నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్లు, ఎన్నికల తమ వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తిగా విన్న అనంతరం హైకోర్టు ఎన్నికలకు సంబంధించి పలు ప్రశ్నలను అడిగింది. ఆ తర్వాత తీర్పు రిజర్వులో పెట్టింది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని అడగడంతో ప్రభుత్వం 60 రోజులు గడువు కావాలని కోరింది. కాగా గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు స్పందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజులు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్నికల నిర్వహణపై కోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది.