నిద్రమత్తులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
న్యూస్6 డెస్క్
రాజకీయ పలుకుబడి ఉన్న మధ్యవర్తుల అండతో, రాష్ట్ర ఆదాయానికి రూ.600 కోట్లు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్న మిల్లర్లు, టెండర్ ఏజెన్సీలు
పౌర సరఫరాల శాఖకు చెందిన ఉన్నతాధికారుల అండతో ఈ కుట్రకు తెరలేపుతున్నట్టు ఆరోపిస్తున్న నిఘా వర్గాలు
ఏడాదిన్నర నుండి ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించని టెండర్ ఏజెన్సీలు, చెల్లించాల్సిన బకాయిల్లో కూడా రూ.600 కోట్లు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్న ఏజెన్సీలు
గ్లోబల్ టెండర్ రేటు ప్రకారం ఒక్క క్వింటాల్ ధాన్యానికి రూ.2 వేలు చెల్లించాల్సి ఉండగా, తమ పలుకుబడితో రూ.1700 మాత్రమే చెల్లించే విధంగా చేస్తామని బకాయిలు చెల్లించకుండా టెండర్ ఏజెన్సీలను ఆపుతున్న మధ్యవర్తులు
టెండర్లు రద్దు చేయిస్తున్నాము, ఏజెన్సీలకు డబ్బులు కట్టకండి అని మిల్లర్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్న మధ్యవర్తులు
మేము చెప్పినట్టు వింటే క్వింటాల్ ధాన్యానికి రూ.300 తగ్గిస్తామని మిల్లర్లకు భరోసా ఇచ్చిన మధ్యవర్తులు
తగ్గించిన రూ.300 లో ఒక్కో క్వింటాల్ కు రూ.50 చొప్పున కమిషన్ పంచుకునేందుకు కుట్ర చేస్తున్న మధ్యవర్తులు
ఇటీవల బంజారాహిల్స్ లోని ఒక కార్పొరేట్ భవనంలో సమావేశమయ్యి, అక్కడినుండే మిల్లర్లకు ఫోన్లు చేసి మాట్లాడిన ఏజెన్సీలు, మధ్యవర్తులు
ఈ అంశంపై నిఘా వర్గాలు పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల అండతోనే రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శిస్తున్న నిపుణులు