మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వరంగల్ లో జరిగే సదస్సును జయప్రదం చేయండి సిపిఐ (ఏం ఎల్) న్యూడెమోక్రసీ
ఖమ్మంలో పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్న న్యూడెమోక్రసీ శ్రేణులు
అనంతరం మాట్లాడుతున్న న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్
భారత రాజ్యాంగం,ఆదివాసీల హక్కులు, మావోయిస్టులతో శాంతి చర్చలు అనే అంశం మీద రేపు 25వ తారీఖు నాడు వరంగల్ పట్టణంలో అబ్నుస్ ఫంక్షన్ హాల్ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సును పార్టీ శ్రేణులు మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని ఈరోజు ఖమ్మం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టులను, నక్సలైట్ల పేరుతోనే ఆదివాసీలను హతమారుస్తున్నాడని,తక్షమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు జెవి చలపతిరావు, గోవర్ధన్,ఆవునూరి మధు,ఎం శ్రీనివాస్,సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు నగర కార్యదర్శి పాముల మోహన్ రావు,షేక్ సుభహాన్, గౌని మోహన్ రావు, జాన్ రెడ్డి, శ్రీను, మాధవరావు, కృష్ణారావు, భాస్కర్, వెంకటేశ్వర్లు పి డి యస్ యు జిల్లా కార్యదర్శి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు