అంగన్వాడీ టీచర్ మెహబూబ్ బి కుటుంబానికి న్యాయం చేయాలి – IFTU

అంగన్వాడీ టీచర్ మెహబూబ్ బి కుటుంబానికి న్యాయం చేయాలి

అంగన్వాడీ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని,ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ కి వినతి పత్రం

ఖమ్మం జూన్ 24 (న్యూస్6)

భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) ఆధ్వర్యంలో కారేపల్లి (సింగరేణి)మండలం గాదేపాడులో అంగన్వాడి సెంటర్లో వీధులు నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ బి గత శనివారం ప్రాజెక్టు మీటింగు ఉన్నందువలన కామేపల్లి మండలం లింగాలలో మీటింగుకు హాజరై వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఆ మహబూబ్ బి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని,వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా యాక్సిడెంట్లో గాయపడిన అంగన్వాడి హెల్పర్ కమల కు వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సహకారం అందించాలని, ఆరోగ్యం మెరుగుపడేంతవరకు పని దినాలుగానే చూడాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది,

అదేవిధంగా అంగన్వాడి కేంద్రాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని,ఖాళీగా ఉన్న టీచర్ మరియు హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయాలని, పక్కా నూతన భవనాలను నిర్మించాలని,మెటీరియల్ గ్రాంట్,మౌలిక వసతులు కల్పించాలని,కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ లపై అధికారుల వేధింపులను అరికట్టాలని,తదితర సమస్యల పైన ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదిప్ కు భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) ఆధ్వర్యంలో వినతి పత్రంఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) జిల్లా అధ్యక్షులు షేక్ సుబహాన్, ప్రగతిశీల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు శిరోమణి,పారిజాతం,ఐ యఫ్ టి యు జిల్లా నాయకులు,భాను,గౌని మోహన్ రావు,పటేల్, మాధవ్,తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు