దూదేకుల కులస్తులకు సంక్షేమ పథకాలు అందించాలి … ఖమ్మం జిల్లా అధ్యక్షులు బడేసాహెబ్

దూదేకుల కులస్తులకు సంక్షేమ పథకాలు అందించాలి … ఖమ్మం జిల్లా అధ్యక్షులు బడేసాహెబ్

ఖమ్మం 28 జూన్ ( న్యూస్6 డిజిటల్ నెట్వర్క్ )

శనివారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన ఖమ్మం జిల్లా దూదేకుల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు బడే సాహెబ్ పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సలీం అధ్యక్షత వహించారు . ముఖ్యంగా దూదేకుల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం బీద దూదేకుల కులస్తులకు ఇంద్రమ్మ ఇళ్లలో గాని రాజీవ్ యువ వికాసం లోన్లలో గాని తదితర సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు . అనంతరం జరిగిన కార్యక్రమంలో మన దూదేకుల సంఘం ఖమ్మం నగర అధ్యక్షులు షేక్ లతీఫ్ కు ఖమ్మం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నామినేటెడ్ పదవి వచ్చిన సందర్భంగా వారిని సంఘ సభ్యులు అందరూ సాల్వాతో ఘనంగా సన్మానించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పుల్లాసాహెబ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మీరా గోపాలపురం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహమ్మద్ అబ్దుల్ కలాం, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అన్వర్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ కైకొండాయిగూడెం, జిల్లా యూత్ అధ్యక్షులు షేక్ నాగ సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ సిద్ధిక్, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ సైదులు పల్లిపాడు, జిల్లా నాయకులు షేక్ అన్వర్ పాషా రియల్ ఎస్టేట్ జిల్లా, కోశాధికారి షేక్ జానీ టీచర్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ వలి కోటపాడు, నాయకులు షేక్ బాదుల్లా షేక్ పీరా హుస్సేన్, షేక్ సిద్ధిక్ పాండురంగాపురం, తదితరులు  పాల్గొన్నారు .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు