మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన కన్స్యూమర్ ఫోరం
సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా మహేష్ బాబును చేర్చిన పిటిషనర్లు
మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్‌లో ఒక ప్లాట్ కోసం సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు రూ.34,80,000 చెల్లించామని రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేసిన బాధితులు
కొద్ది రోజుల తరువాత అసలు లేఅవుట్ లేదని తెలిసి డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే, కేవలం రూ.15 లక్షలు చెల్లించారని, తమకు న్యాయం చేయాలని కన్స్యూమర్ ఫోరంలో పిటిషన్ దాఖలు చేసిన బాధితులు
బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ బాబును, రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం