టీడీపీ పార్టీ లో సీనియర్ నేతకు లక్కీ ఛాన్స్ గవర్నర్ పదవి దక్కే అవకాశాలు – ఎన్డీయే కూటమి ఏరి కోరి అతన్నే ఎంపిక..చేయనున్నట్టు పార్టీ నేతల సమాచారం!?
ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. బీహార్ తో పాటుగా త్వరలో మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. పార్టీలో జాతీయాధ్యక్షుడు మొదలు.. అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. మిత్రపక్షాలకు సైతం గవర్నర్లు.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. 2014-19 కాలంలో నే టీడీపీకి నాడు గవర్నర్ పదవి పైన బీజేపీ హామీ ఇచ్చింది. అయితే, ఆ తరువాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటక వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు.
గతంలో ఇచ్చి అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీకి ఆఫర్ అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం.
టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్లు సమా చారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది
టీడీపీలో ముఖ్య నేతగా.. వివాదారహితుడుగా పేరున్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదు. అయితే, సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించిన తరువాత అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.