మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాం: పొంగులేటి
Jul 17, 2025,
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాం: పొంగులేటి
తెలంగాణ : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా పేదల కోసం ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. భద్రాద్రి(D) ఇల్లెందులో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గోని మాట్లాడారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన BRS నాయకుడు మహిళలకు పావళా వడ్డీ రుణాన్ని ఎత్తివేశారని.. రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారని అన్నారు. కానీ తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందని.. ఇప్పటి వరకు రూ.856 కోట్లు ఇచ్చిందన్నారు.