స్థానిక ఎన్నికల్లో సత్త చాటుదాం – హేమంతరావు

-కమ్యూనిజం అజేయం… అజరామరం

-యువతే రాజకీయ భవిష్యత్కు పునాది

– బలమైన నిర్మాణమే లక్ష్యంగా కార్యచరణ

-స్థానిక ఎన్నికల్లో సత్త చాటుదాం

మధిర జూలై 20 న్యూస్ 6

సమాజంలో ఆర్థిక అసమానతలు వర్గాలు ఉన్నంతవరకు కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతుందని, ఎవరు -వద్దనుకుంటే ఆగేదికాదని, కమ్యూనిజం.. అజేయం అజరామరం అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. కమ్యూనిస్టుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీ మొదలైన మత శక్తులు కమ్యూనిస్టులను లేకుండా చేస్తామని ప్రగల్భాలు -పలుకుతున్నాయన్నారు. ఆదివారం మదిర పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లోని పోటు ప్రసాద్నగర్లో భారతకమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఖమ్మం జిల్లా 23వ మహాసభలు రెండవ రోజు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ… సమాజంలో -మార్పు అనివార్యం అని మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడిదారి సమాజంలో అవినితి పెరిగినప్పుడు ఆ సమాజం పతనం అవుతుందని, ఇప్పుడు దేశంలో అదే పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు సానుకుల పవనాలు విస్తున్నాయని, గత -ఎన్నికలలో 0.5శాతం ఓట్లు సాధించిన కమ్యూనిస్టు పార్టీ శ్రీలంకలో అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో బీజేపీ తన విధానలతో -నిరంకుశపాలనకు దారి తీస్తుందని హేమంల్రావు ఆరోపించారు. ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టుల ఏరివేతతో అమాయిక ఆదివాసులను హతమారుస్తున్నారని, భవిష్యత్తులో అర్బన్ నక్సలిజం పేరుతో కమ్యూనిస్టులను, ప్రశ్నించే వారిని హతమార్చేప్రమాదం ఉందని హెచ్చరించారు. మైనార్టీలే టార్గెట్గా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ను తన జేబు -సంస్థగా మార్చుకొని, విపక్ష ఓటర్లను తొలగించే పనిలో ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థకే ముప్పు తెచ్చే ప్రయత్నంలో ఉందన్నారు.

మీడియాను నియంత్రిచండంతో పాటు సోషల్మీడియా ద్వారా అభద్ధాల ప్రచారాలతో వాస్తవాలను మరుగున పెడుతుందని హేమంల్రావు ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు విషయంలో నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తుందన్నారు. విధాననిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. కాంగ్రెస్ గెలుపుకోసం కీలకంగా -వ్యహరించిన సిపిఐ విషయంలో మిత్ర ధర్నాన్ని పాటించాలని కోరారు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువత నిరాశలో ఉందని, వారిని ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షించాలని హేమంత్గావు పిలుపునిచ్చారు. సమాజమార్పు యువతతోనే సాధ్యం అని యువత రాజకీయ భవిష్యత్కు పూనాది అని, ఆయన తెలిపారు. పార్టీ ప్రజా సంఘాల నిర్మానం అత్యంత ఆలస్యం అని ప్రజా సంఘాల -నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలానుగుణంగా పోటీ చేసి అత్యధికస్థానాలలో గెలుపొందేవిధంగా ప్రణాళికరూపొందించాలని కోరారు. పార్టీ నిర్మాణం అధ్యయనం విస్తృతపోరాటాలే లక్ష్యంగా భవిష్యత్ కార్యచరణరూపొందించాలని హేమంర్రావు సూచించారు. మహాసభలలో పార్టీ మండల కార్యదర్శులు ప్రజా సంఘాల బాధ్యులు చర్చలలో పాల్గొనగా సభ లోపల తీర్మానం ఆమోదించారు. జమ్ముల జితేందర్రెడ్డి, అజ్మీరా రామూమర్తి, మందదుపు రాణి, దొండపాటి -రమేష్, యంగాల ఆనంద్రావు అధ్యక్షవర్గంగా వ్యవహరించగా దండి సురేష్, మొహ్మద్ మౌలానా, ఎర్రబాబు, ఎస్కే జానిమీయా, -ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు