సురవరం సుధాకర్ రెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు..సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పలు పార్టీ నాయకులు సంతాపం ..

సురవరం సుధాకర్ రెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు ..

సురవరం సుధాకర్ రెడ్డి మృతికి పలు పార్టీ నాయకులు సంతాపం ..

ఖమ్మం బ్యూరో (న్యూస్ 6) ఆగస్టు/24

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆల్ ఇండియా మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నందు నిన్న అనారోగ్యంతో మృతి చెందటంతో ఈరోజు వైరా పార్టీ సిపిఐ కార్యాలయంలో మండల సమితి ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమం పార్టీ మండల కార్యదర్శి యామాల గోపాలరావు అధ్యక్షతన జరిగినది .
ఈ సందర్భంగా యామాల గోపాలరావు సురవరం సుధాకర్ రెడ్డి . ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ యర్రాబాబు ,సిపిఐఎం రాష్ట్ర నాయకులు బంతు రాంబాబు ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి ,సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కంకణాల అర్జున్ రావు, టిడిపి పట్టణ అధ్యక్షులు బొల్లెపల్లి శ్రీనివాసరావు , టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు ,లతోపాటు పలు పార్టీ నాయకులు పాల్గొని సురవరం సుధాకర్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై భారత దేశంలో అనేక కార్మిక చట్టాలకు అధ్యయనం ఆద్యం పోసిన పీడిత తాడిత ప్రజల ఆశాజ్యోతి అని, ఆయన 1971లో సిపిఐ జాతీయ మండలకి ఎంపికైనాడు. 1995 మరియు 2004లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రెండు పర్యాంతరాలు పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికై ప్రజల పక్షాన పోరాడి ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు లకు అన్ని విధాల ఉపయోగపడే విధంగా ,కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రజలు ఫ్లోరైడ్ వాటర్ తాగి కాళ్లు మెలికలు తిరిగిపోతూ ఉండటంతో చూసి చలించిపోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫ్లోరైడ్రై రహిత గ్రామాలుగా చూడాలని పోరాడి అట్టి వాటర్ తీసుకొచ్చి ప్రజలకు త్రాగునీరు అందించిన ఘనత సురవరంధేనని, చిన్నతనము నుండి అనేక ఉద్యమాలు చేసి ప్రజల సమస్యల తీర్చిన ఘనత ఆయనకే తగ్గిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయటంలో కీలక భూమిక పోషించి అనేక పోరాటాలు నిర్వహించడమే కాకుండా తన తుది శ్వాస విడిచేంతవరకు పేద ప్రజల అనగారిన వర్గాల కోసమే పోరాడి తపించి పోయిన వ్యక్తిని నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు మిట్టపల్లి రాఘవరావు ,గారపాటి అశోక్ ,కొండా రామకృష్ణ ,మూటకొండ, మైక్ షరీఫ్ ,గంజినమైన తిరుమలయ్య, మోరు శ్రీనివాసరావు , మోర్ సామేలు,ఆళ్ల రాంబాబు ,చింతపల్లి గోపాలరావు , జగదీష్ డేవిడ్ రాజ్, యాకూబలి , సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నియోజకవర్గ నాయకులు ఎల్లదండి బాబు,ఏఐటియుసి ఆటో యూనియన్ అధ్యక్షులు రామకృష్ణ, బాబురావు, గోపి ,జమీలు, నవీను, సైదులు , మునేసు . శివ , కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు పొదిలి హరినాథ్ , టిడిపి పట్టణ నాయకులు గుండ్ల నాగేశ్వరరావు, బోడెపూడి మురళి, నాయకులు రాంబాబు ముత్తయ్య రామకృష్ణ టిఆర్ఎస్ మండల నాయకులు ఏదునూరి శ్రీనివాసరావు ,పట్టణ కార్యదర్శి రాయపూడి రవి, వడ్డెర సంఘం జిల్లా నాయకులు ఓర్సు నరసింహ రావు, ఏరా మండల ఆర్యవైశ్య నాయకులు గ్రంధి ప్రవీణ్ కుమార్, గుండాల రవి, రాము, రాయల్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొని సురవరం సుధాకర్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు