యూరియా నిల్వలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి మంజు ఖాన్..
ఖమ్మం బ్యూరో (న్యూస్ 6) ఆగస్ట్/25
వైరా మండలం విప్పలమడక గ్రామంలో కొత్తగా నిర్మించిన సొసైటీ గోదామునకు యూరియా సరఫరా
10 టన్నుల యూరియా దిగుమతి చేశారు. ఈ సొసైటీ విప్పలమడక, లింగన్నపాలెం రైతులకు యూరియా తీసుకునే అవకాశం ఉంటుందని వైరా మండల వ్యవసాయ అధికారి మాయన్ మంజుఖాన్ తెలిపారు. యూరియా నిలవలను పరిశీలించారు. యూరియా కొనుగోలు కి వచ్చే రైతులు తమ పట్టాదారు పాస్ బుక్,ఆధార్ కార్డు జీరాక్స్ తీసుకుని రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ ఏ డి ఏ తుమ్మలపల్లి కరుణశ్రీ ఏఈవోలు వెంపటి కీర్తి, సపావత్ సైదులు, సొసైటీ సిబ్బంది, రైతులు కాట్రేవుల వెంకటేశ్వర్లు, వీరభద్రం, తోటకూర నాగేశ్వర రావు, తోటకూర శివయ్య పాల్గొన్నారు.









