నూతన ఎమ్మార్వో ను మర్యాదపూర్వకంగా కలిసిన వందనం గ్రామ కాంగ్రెస్ నేతలు

నూతన ఎమ్మార్వో ను మర్యాదపూర్వకంగా కలిసిన వందనం గ్రామ కాంగ్రెస్ నేతలు

చింతకాని : సెప్టెంబర్ 20 ( న్యూస్ 6 డిజిటల్ )

చింతకాని మండల నూతన ఎమ్మార్వో ను శుక్రవారం వందనం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్ ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. అనంతరం చింతకాని మండలంలో సమస్యలు పరిష్కారానికి తమ సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు నూతన ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన నూతన ఎమ్మార్వో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వందనం గ్రామ శాఖ అధ్యక్షులు పాశం సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆవుల సైదులు, పొన్నం శంకర్ రావు, కాంగ్రెస్ యువజన నాయకులు యస్. కె పాషా( జర్నలిస్ట్ ), మున్నా, ఉసికల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు